అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా యూఏఈతో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసిది. టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర సెంచరీ చేశాడు.
కేవలం 56 బంతుల్లోనే తన రెండో యూత్ వన్డే సెంచరీ మార్క్‌ను వైభవ్ అందుకున్నాడు. మొత్తంగా 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్‌తో పాటు ఆరోన్ జార్జ్(69), విహాన్ మల్హోత్రా(69) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ అయూష్ మాత్రే(4) సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు.