ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది.. చివరికి పిల్లల డీఎన్ఏ తో మ్యాచ్ చేసిన పోలీసులు

భర్తను కొట్టి చంపి, మృతదేహాన్ని చెక్కల మెషిన్ లో ముక్కలు చేసినందుకు ఒక మహిళ, ఆమె ప్రేమికుడిని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

By -  అంజి
Published on : 23 Dec 2025 10:11 AM IST

UttarPradesh, Woman, Lover Kill Husband, Chop Body With Grinder, Crime

ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది.. చివరికి పిల్లల డీఎన్ఏ తో మ్యాచ్ చేసిన పోలీసులు

భర్తను కొట్టి చంపి, మృతదేహాన్ని చెక్కల మెషిన్ లో ముక్కలు చేసినందుకు ఒక మహిళ, ఆమె ప్రేమికుడిని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిందితులను రూబీ, గౌరవ్‌లుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసు సూపరింటెండెంట్ కె కె బిష్ణోయ్ తెలిపారు.

చందౌసి మొహల్లా చున్నీ నివాసి అయిన రూబీ నవంబర్ 18న తన భర్త రాహుల్ (38) కనిపించకుండా పోయాడని పేర్కొంటూ మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తర్వాత, డిసెంబర్ 15న ఈద్గా ప్రాంతానికి సమీపంలోని కాలువ నుండి పోలీసులు ఒక ఛిద్రమైన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంలో తల, చేతులు, కాళ్లు కనిపించలేదు. మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. ఫోరెన్సిక్ బృందం వివరణాత్మక పరీక్ష నిర్వహించి, DNA నమూనాలను సేకరించింది. అయితే మృతదేహంపై రాహుల్ అనే పేరు రాసి ఉందని పోలీసులు కనుగొన్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్లలో తప్పిపోయిన వ్యక్తుల నివేదికలను సమీక్షించడం, సాంకేతిక విశ్లేషణలో భాగంగా నవంబర్ 18 నుండి రాహుల్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని తేలింది.

తదుపరి దర్యాప్తులో రూబీ ప్రమేయం ఉందని పోలీసులు అనుమానించారు. విచారణలో రూబీ అక్రమ సంబంధం భర్తకు తెలిసిపోయింది. తన ప్రేమికుడు గౌరవ్ సహాయంతో భర్తను చంపినట్లు ఆమె అంగీకరించింది. రాహుల్‌పై ఇనుప రాడ్ తో దాడి చేసి అక్కడికక్కడే చంపామని నిందితులు పోలీసులకు తెలిపారు. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. శరీరంలోని ఒక భాగాన్ని కాలువలో పడవేసి, మిగిలిన భాగాలను రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్లి గంగా నదిలో పడేశారని పోలీసులు తెలిపారు. శరీరాన్ని కోసేందుకు ఉపయోగించిన మెషీన్ తో పాటు, దాడిలో ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వ్యక్తికి సంబంధించిన DNA నమూనాలను భద్రపరిచారు. అతని పిల్లల నమూనాలతో సరిపోల్చడం ద్వారా గుర్తింపును నిర్ధారించారు పోలీసులు.

Next Story