ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్‌ రేప్‌

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫెఫ్నా ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై ఇద్దరు అబ్బాయిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

By అంజి  Published on  6 March 2024 1:13 PM IST
UttarPradesh, Crime news

ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్‌ రేప్‌

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫెఫ్నా ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై ఇద్దరు అబ్బాయిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం బాలిక తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ డిపి తివారీ తెలిపారు. ఆమెతో సహచరులైన ఇద్దరు అబ్బాయిలు ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

ఇంటికి తిరిగి వచ్చిన బాలిక తన తల్లికి జరిగిన ఘోరాన్ని వివరించింది. మంగళవారం నాడు తల్లి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, సెక్షన్ 376 (రేప్), పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు పంపగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. 10, 12 ఏళ్ల వయసున్న బాలురను అదుపులోకి తీసుకుని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వారిని రిమాండ్‌ హోంకు తరలించారు.

Next Story