దారుణం.. భార్య వేసుకున్న డ్రెస్‌ నచ్చలేదని చంపేశాడు

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఓ వ్యక్తి చిన్న వివాదం కారణంగా భార్యను హత్య చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు

By అంజి  Published on  15 March 2023 9:26 AM IST
Uttarpradesh, Crime news

భార్య వేసుకున్న డ్రెస్‌ నచ్చలేదని చంపేశాడు

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఓ వ్యక్తి చిన్న వివాదం కారణంగా భార్యను హత్య చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు మంగళవారం పోలీసు అధికారులు సమాచారం వెల్లడించారు. సమాచారం ప్రకారం.. ఈ సంఘటన అలీఘర్‌లోని బార్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘాజీపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. ఇక్కడ 28 ఏళ్ల సప్నా మృతదేహం లభ్యమైంది. సప్నాను ఆమె భర్త మోహిత్ కుమార్ హత్య చేశాడు.

మోహిత్ తన భార్య సప్న వేసుకున్న దుస్తులు నచ్చకపోవడంతో ఈ దారుణానికి తెగబడ్డాడని పోలీసులు చెబుతున్నారు. హత్యకు పాల్పడిన నిందితుడు మోహిత్ తన భార్యను పదేపదే హెచ్చరించాడని విచారణలో పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత కూడా ఆమె డ్రెస్‌ సరిదిద్దుకోలేదు. ఈ విషయమై అతడితో వాగ్వాదం జరగడంతో ఆగ్రహంతో సప్న మెడపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. హత్య తర్వాత మోహిత్ తన భార్య మృతదేహం దగ్గర కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం.. మోహిత్, సప్నా దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ ఘటనపై జోనల్ అధికారి సర్జనా సింగ్ మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story