పరువు హత్య: కుమార్తెను చంపిన తండ్రి.. 'జారిపడి' చనిపోయిందని నాటకం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. హిందూపూర్ గ్రామంలో ఇంటి నుంచి
By అంజి Published on 27 March 2023 2:15 AM GMTపరువు హత్య: కుమార్తెను చంపిన తండ్రి.. 'జారిపడి' చనిపోయిందని నాటకం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. హిందూపూర్ గ్రామంలో ఇంటి నుంచి ప్రియుడితో వెళ్లిన కుమార్తెలు తిరిగి రాగానే పెద్ద బాలికను హత్య చేసి మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చిపెట్టాడు తండ్రి. హత్య చేసిన తండ్రితో పాటు ఇద్దరు కుమారులు, భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. స్మశానవాటికలో పాతిపెట్టిన పెద్ద కుమార్తె మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపారు.
కార్చన పోలీస్ స్టేషన్‌కు కొంత దూరంలోని హిందూపూర్ గ్రామానికి చెందిన లల్లన్ అలీ మొదటి భార్య మృతి చెందింది. లల్లన్‌కు ఇద్దరు కుమారులు రహీమ్, మున్నా. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో చాందిని (19), ఆషియా (16) ఇద్దరు కుమార్తెలు. చాందిని ఇంటర్ చదువుతుండగా, ఆషియా 9వ తరగతి చదువుతోంది. సోషల్ మీడియాలో మీర్జాపూర్‌కు చెందిన బాబుతో చాందినీ స్నేహం గురించి తెలియగానే తండ్రికి కోపం వచ్చేది. కూతురి మొబైల్ లాక్కున్నాడు.
ఫిబ్రవరి 25న అక్కాచెల్లెళ్లిద్దరూ హఠాత్తుగా ఇంటి నుంచి కనిపించకుండా పోయారు. దీని తరువాత మిస్సింగ్ నమోదు చేయబడింది. ఎన్నో గాలింపు చర్యల అనంతరం మార్చి 2న బాలికలిద్దరినీ ఆమె సోదరుడు రహీమ్ ఇంటికి తీసుకొచ్చాడు. విచారణలో ఆమె ముంబై వెళ్లినట్లు ఇద్దరూ చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 23వ తేదీ రాత్రి పెద్ద కూతురు చాందినిని తండ్రి గొంతునులిమి హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లో ఒక రోజు దాచి ఉంచాడు. శుక్రవారం చాందిని మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేశారు.
ముందస్తు హత్య
ప్లాన్ వేసి పెద్ద కుమార్తెను హత్య చేసి మృతదేహాన్ని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టాడు లల్లన్. ఆమె ఇంట్లో నేలపై జారిపడిందని బంధువులు తెలిపారు. దీంతో తలపై గాయమై మృతి చెందిందని చెప్పారు. గ్రామస్తులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ జరిపి లల్లన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులకు పట్టుబడిన తర్వాత, లల్లన్ తన నేరాన్ని అంగీకరించాడు.
ఏసీపీ కార్చన అజిత్ సింగ్ చౌహాన్ సమక్షంలో పోలీసులు కూలీలను పిలిపించి సమాధిని తవ్వి చాందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బంధువు రహీమ్ తహ్రీర్‌పై, చాందిని తండ్రి లల్లన్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ ఏసీపీ అజిత్ సింగ్, పోలీసు బలగాలతో కలిసి లల్లన్ ఇంటికి చేరుకుని, సమీపంలోని వ్యక్తుల నుండి కూడా సమాచారం తీసుకున్నారు. కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఇన్‌ఛార్జ్ విశ్వజిత్ సింగ్ తెలిపారు.
చిన్న కూతురిని కూడా బెదిరించి చంపాలని ప్లాన్ చేశాడు
చిన్న కూతురిని కూడా లల్లన్ బెదిరించేవాడు. అక్క హత్య విషయం ఎవరికైనా చెబితే అదే గతి పడుతుందని బెదిరించాడు. చిన్న కూతురు తల్లి మెహరునిషాను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసులు విచారిస్తున్నారు. చిన్న కూతురిని కూడా హత్య చేయాలని ప్లాన్ వేసినట్లు సమాచారం.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. హిందూపూర్ గ్రామంలో ఇంటి నుంచి