పెళ్లైన విషయం చెప్పలేదని.. ప్రియుడిని చంపిన యువతి
Uttar Pradesh woman kills man for hiding his first marriage. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలో మాజీ సీఆర్‌పీఎఫ్ జవాను హత్య కేసులో ఓ మహిళ, ఆమె తండ్రి,
By అంజి Published on 20 Jan 2023 7:17 AM GMTఉత్తరప్రదేశ్‌లోని బస్తీలో మాజీ సీఆర్‌పీఎఫ్ జవాను హత్య కేసులో ఓ మహిళ, ఆమె తండ్రి, సహచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 10న కల్వారీ పోలీస్ సర్కిల్ పరిధిలోని సుజావల్‌పూర్ గ్రామంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల తర్వాత మృతుడిని రాకేష్ సరోజ్‌గా గుర్తించారు. రాకేష్ 2020లో సీఆర్‌పీఎఫ్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ పొంది ట్రావెల్ వ్యాపారం ప్రారంభించాడని కల్వారీ పీఎస్ ఎస్‌హెచ్‌వో అలోక్ శ్రీవాస్తవ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ''రాకేష్‌కి అతని భార్యతో గొడవ జరిగింది. దాని కారణంగా ఆమె కోల్‌కతాలోని తన బంధువుల వద్ద కొంతకాలం ఉండటానికి వెళ్లింది. ఈలోగా రాకేష్ స్నాప్‌చాట్ ద్వారా సునీత అనే యువతిని కలిశాడు. ఆపై ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే తనకు పెళ్లయిందని రాకేష్ సునీతకు చెప్పలేదు. గత పదేళ్లుగా కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నందున ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.''
2022 డిసెంబర్‌లో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్న కొద్ది రోజుల తర్వాత, సీఆర్‌పీఎఫ్‌లో తనకున్న పరిచయం ద్వారా అతనికి అప్పటికే పెళ్లయిందని సునీతకు తెలిసింది. దీంతో కోపోద్రిక్తురాలైన సునీత రాకేష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకుంది. పోలీసు అధికారి మాట్లాడుతూ.. ''జనవరి 9న సునీత మొదట రాకేష్‌కు ఫోన్ చేసి రూ. 3 లక్షలు డిమాండ్ చేసింది. సాంకేతిక లోపం వల్ల లావాదేవీ జరగడం లేదని, కేవలం రూ.లక్ష మాత్రమే ఇస్తానని రిటైర్డ్ జవాన్ ఆమెకు చెప్పాడు. అతను మరుసటి రోజు ఉదయం ఆమెను కలిశాడు. పథకం ప్రకారం.. రాకేష్ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే అతని తలపై పదునైన ఆయుధంతో దాడి చేసి, ఆపై గొంతు నులిమి చంపింది. తరువాత ఆమె తండ్రి, అతని సహచరుడి సహాయంతో మృతదేహాన్ని పడేశారు.''
జనవరి 10 ఉదయం సునీతకు చివరి కాల్ వచ్చిందని రాకేష్ కాల్ డిటెయిల్ రికార్డ్ చూపించింది. ఆ తర్వాత పోలీసు విచారణ బృందం ఆమెను తీసుకొని విచారించగా చివరకు ఆమె నేరాన్ని అంగీకరించింది.