రూ.500 ఇవ్వలేదని.. తండ్రిని చంపిన కొడుకు

రూ.500 ఇవ్వలేదన్న కారణంతో ఓ 25 ఏళ్ల యువకుడు తన తండ్రిని హత్య చేసిన ఘటన రాయ్‌బరేలీలో చోటుచేసుకుంది.

By అంజి  Published on  5 Jan 2024 4:09 AM GMT
Uttar Pradesh,  Crime news, Rae Bareli

రూ.500 ఇవ్వలేదని.. తండ్రిని చంపిన కొడుకు

రూ.500 ఇవ్వలేదన్న కారణంతో ఓ 25 ఏళ్ల యువకుడు తన తండ్రిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటుచేసుకుంది. నిందితుడు సంజయ్ యాదవ్‌ను గురువారం అరెస్టు చేశారు. సంజయ్, అతని తండ్రి త్రిలోకి రాయ్ బరేలీలోని ఒక ఇటుక బట్టీలో పనిచేసేవారు. ఈ హత్య జనవరి 1న ఉంచహార్ పోలీస్ సర్కిల్ పరిధిలో జరిగింది. విచారణలో.. పోలీసులు ఇటుక బట్టీ యజమానిని సంప్రదించారు, అతను హత్య జరిగిన రోజున త్రిలోకి తనకు చేసిన చివరి కాల్ రికార్డింగ్‌ను ప్లే చేశాడు.

డబ్బు ఇవ్వకుంటే చంపేస్తానని సంజయ్ బెదిరిస్తున్నందున తనకు రూ.500 అప్పుగా ఇవ్వాలని త్రిలోకి కాల్‌లో ఇటుక బట్టీ యజమానిని అభ్యర్థించాడు. దీంతో పోలీసులు సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారని, అతడు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. రాయ్‌బరేలీ పోలీస్ సూపరింటెండెంట్ అలోక్ ప్రియదర్శి మాట్లాడుతూ.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, స్థానికులు త్రిలోకిని గుర్తించారని, అతను డ్రింకర్, తన కుమారుడు సంజయ్‌తో ఎప్పుడూ గొడవపడేవాడని వెల్లడించాడు.

"సంజయ్‌ను మేము మొదట ప్రశ్నించాము, అతను సంఘటన జరిగినప్పుడు గ్రామంలో లేడని, అతని తండ్రి తాగుబోతు అని, ప్రమాదానికి గురయ్యాడని చెప్పాడు" అని అధికారి చెప్పారు. "అయితే, మేము పగిలిన మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందాము. అన్ని కాల్ రికార్డ్‌లను తనిఖీ చేసా" అని అధికారి తెలిపారు. కాల్ రికార్డింగ్ ప్లే చేసిన కాంట్రాక్టర్‌ను పోలీసులు కలిశారని, నిందితుడి గురించి తెలుసుకున్నామని చెప్పారు.

"మేము రికార్డింగ్‌తో సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నాం అతను రూ. 500 అడిగానని ఒప్పుకున్నాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు, ఇది అతనికి కోపం తెప్పించింది. కాంట్రాక్టర్ తన కాల్ డిస్‌కనెక్ట్ చేసిన తర్వాత, సమీపంలో ఉన్న చెక్క పలకతో తండ్రి తలపై కొట్టాడు” అని పోలీసులు తెలిపారు. ఆ దెబ్బ బలంగా తగలడంతో త్రిలోకి రక్తమోడుతూ కిందపడి చనిపోయాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి బయట పడేసి పరారయ్యాడు.

Next Story