దారుణం.. భార్యని చంపి, మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తనను హత్య చేయాలని భావించిన భార్యని భర్త దారుణంగా హత్య చేశాడు

By అంజి
Published on : 10 May 2023 2:00 PM IST

Uttar Pradesh, man kills wife,  septic tank, Crime news

దారుణం.. భార్యని చంపి, మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు 

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తనను హత్య చేయాలని భావించిన భార్యని భర్త దారుణంగా హత్య చేశాడు. 35 ఏళ్ల నిందితుడు, నన్హే ఖాన్, తాపీ మేస్త్రీ, పదునైన కత్తితో భార్య మెడపై పదేపదే పొడిచి చంపాడు. తరువాత మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు. మొరాదాబాద్‌లోని సివిల్‌లైన్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో రక్తపు మరకలతో అర్ధరాత్రి ఇంటి నుంచి బయలుదేరిన నాన్హేను ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు.

ఎస్‌ఎస్‌పీ హేమ్‌రాజ్ మీనా మాట్లాడుతూ.. ''మేము నిందితుడిని అరెస్టు చేసాము. అతనిపై హత్య కేసు నమోదు చేసాము. అతన్ని విచారిస్తున్నారు'' అని తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు తన మొదటి భార్య నజ్నీన్‌కు విడాకులు ఇచ్చి 2021లో బాధితురాలు రేష్మను వివాహం చేసుకున్నాడు. రేష్మ మొదటి వివాహంలో పుట్టిన మూడేళ్ల కొడుకుతో కలిసి వారు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొన్ని ఇంటి సమస్యలపై విభేదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Next Story