Video: సైకిల్‌పై వెళ్తుండగా చున్నీ లాగిన ఆకతాయిలు.. యువతి దుర్మరణం

ఓ పాఠశాల విద్యార్థిని ఇంటికి వెళుతుండగా అగంతకులు వేధించడంతో ఆమె ఘోర ప్రమాదానికి గురైంది. సైకిల్‌పై వెళ్తున్న యువతి చున్నీని ఒక యువకుడు లాగాడు.

By అంజి  Published on  17 Sept 2023 7:06 AM IST
Uttar Pradesh, girl falls off cycle, Crime news

Video: సైకిల్‌పై వెళ్తుండగా చున్నీ లాగిన ఆకతాయిలు.. యువతి దుర్మరణం

ఓ పాఠశాల విద్యార్థిని ఇంటికి వెళుతుండగా అగంతకులు వేధించడంతో ఆమె ఘోర ప్రమాదానికి గురైంది. 17 ఏళ్ల బాలిక సైకిల్‌పై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమె చున్నీ లాగారు. ఆ తర్వాత ఆమె సైకిల్‌పై నుంచి కిందపడగా, మోటర్‌బైక్‌పై వచ్చిన మరో వ్యక్తి ఆమెపైకి దూసుకెళ్లాడని పోలీసులు శనివారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, సీసీటీవీ కెమెరాలో బంధించబడి, బాలిక తన సైకిల్‌పై నియంత్రణ కోల్పోయి, ఆమె చున్నీ లాగిన వెంటనే పడిపోయినట్లు చూపిస్తుంది. ఆ తర్వాత అగంతకులు ఒకరు నడుపుతున్న బైక్‌ ఆమెపైకి వెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. బాలికను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.

స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, బాలిక మధ్యాహ్నం 3:30 గంటలకు ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు ఆమెను వేధించారని పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లో.. షానవాజ్,అర్బాజ్ అనే ఇద్దరు వ్యక్తులు తన కుమార్తెను వేధించడానికి ప్రయత్నించారని, ఆమె చున్నీ లాగారని బాలిక తండ్రి తెలిపారు. ఆమె కిందపడిపోవడంతో ఫైసల్ అనే మరో వ్యక్తి తన బైక్‌తో ఆమెపైకి దూసుకెళ్లాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఫిర్యాదులో పేర్కొన్న నిందితులను అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి సంజయ్ కుమార్ రాయ్ తెలిపారు. సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story