భార్య పైశాచికత్వం..ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్
ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 31 May 2024 10:51 AM ISTభార్య పైశాచికత్వం..ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్
ప్రస్తుత కాలంలో అందరం స్మార్ట్ ఫోన్‌కు అలవాటు పడిపోయాం. ఇంకొందరు అయితే ఫోన్ లేకుండా అస్సలు ఉండలేరు. కాసేపు ఫోన్ కనిపించలేదంటే చాలు తెగ కంగారుపడిపోతుంటారు. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. దుష్ప్రయోజనాలు అన్నే ఉన్నాయి. అయితే.. ఇదే సెల్‌ఫోన్ దంపతుల మధ్య చిచ్చు రేపింది. భార్య తరచూ ఫోన్లో మాట్లాడుతోందని లాక్కున్నాడు భర్త. అంతే.. అతనిపై కోపం పెంచుకుని ఆ భార్య పైశాచికంగా ప్రవర్తించింది. చిత్రహింసలు పెడుతూ.. కరెంట్ షాక్ పెట్టింది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బేబీ యాదవ్, ప్రదీప్ సింగ్ ఇద్దరూ భార్యాభర్తలు. వీరికి 14 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా. బేబీ యాదవ్ గత కొంతకాలంగా ఫోన్‌లోనే ఉంది. ఎవరితోనే గంటల తరబడి మాట్లాడింది. అది గమనించిన భర్త ప్రదీప్ సింగ్ ఆమెను హెచ్చరించాడు. అయినా కూడా ఆమె వినలేదు. దాంతో.. విసుగెత్తిపోయిన ప్రదీప్ సింగ్.. ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పాడు. వారు బేబీ యాదవ్ నుంచి ఫోన్‌ను తీసుకోవాలని చెప్పారు. అత్తవారు చెప్పినట్లుగానే ఫోన్ భార్య నుంచి తీసుకున్నాడు. అదే అతను చేసిన తప్పుగా మిగిలిపోయింది.
భర్త ఫోన్ లాక్కున్నాడని కోపం పెంచుకుంది భార్య బేబీ యాదవ్. ఎలాగైనా అతనిపై కక్ష తీర్చుకోవాలనుకుంది. అదును చూసి గతవారం భర్తకు మత్తుమందు ఇచ్చింది. ఆ తర్వాత మంచానికి తాళ్లతో కట్టేసి దారుణంగా కొట్టింది. అంతటితో ఆమె కోపం చల్లారలేదు.. పలుమార్లు కరెంట్ షాక్ పెట్టింది. ఇది చూసిన ఆమె కుమారుడు అడ్డుకోబోయాడు. ఆమె మాత్రం సైకోలా ప్రవర్తిస్తూ కొడుకుపై కూడా దాడికి తెగబడింది. చివరకు ఎలాగోలా భార్య నుంచి తప్పించుకున్న ప్రదీప్ సింగ్ .. నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య చిత్ర హింసలు పెడుతోందని కంప్లైంట్ చేశాడు. ఈ మేరకు పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితురాలు పరారీలో ఉందనీ.. ఆమె కోసం వెతుకుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.