భార్యపై ఇద్దరు గ్యాంగ్‌ రేప్‌.. దంపతులు ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని ఒక గ్రామంలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కొన్ని గంటల తర్వాత.. బాధితురాలు, బాధితురాలి భర్త ఆత్మహత్య చేసుకున్నారు.

By అంజి  Published on  24 Sep 2023 4:18 AM GMT
Uttar Pradesh, suicide, Crime news

భార్యపై ఇద్దరు గ్యాంగ్‌ రేప్‌.. దంపతులు ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని ఒక గ్రామంలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కొన్ని గంటల తర్వాత.. బాధితురాలు, బాధితురాలి భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి భర్త మృతి చెందగా, మరుసటి రోజు గోరఖ్‌పూర్‌లోని ఆసుపత్రిలో భార్య మరణించినట్లు బస్తీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గోపాల్ కృష్ణ తెలిపారు.

సెప్టెంబరు 20 , 21 మధ్య రాత్రి రుధౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆమె ఇంట్లో ఇద్దరు వ్యక్తులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని దంపతుల బంధువులు చెప్పారని ఎస్పీ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు, దంపతులు నిందితుల పేర్లను పేర్కొన్న వీడియోను రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా, ఇద్దరు వ్యక్తులపై సెక్షన్లు 376 డి (గ్యాంగ్ రేప్), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కృష్ణ తెలిపారు.

శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. తాము విషం తాగి చనిపోతామని తల్లిదండ్రులు చెప్పారని దంపతుల పిల్లలు పోలీసులకు తెలిపారని పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు, ఎనిమిది, ఆరేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, ఏడాది వయసున్న కుమార్తె ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, అత్యాచార ఘటనకు బాధితురాలి ఆధీనంలో ఉన్న భూమిని విక్రయించడంతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.

Next Story