దారుణం.. సహోద్యోగి కూతురిపై కానిస్టేబుల్‌ లైంగిక వేధింపులు

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సహోద్యోగి ఎనిమిదేళ్ల కుమార్తెను పీఏసీ కానిస్టేబుల్‌ లైంగికంగా వేధింపులకు గురి చేశాడు.

By అంజి  Published on  15 Aug 2023 10:44 AM IST
Uttar Pradesh, Constable held, colleague daughter, Crime news

దారుణం.. సహోద్యోగి కూతురిపై కానిస్టేబుల్‌ లైంగిక వేధింపులు

తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సహోద్యోగి ఎనిమిదేళ్ల కుమార్తెను పీఏసీ కానిస్టేబుల్‌ లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలపై పీఏసీ కానిస్టేబుల్ సుధీర్ కుమార్‌ను మిర్జాపూర్‌లోని కత్రా కొత్వాలి పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసి అరెస్టు చేశారు. ఏఎస్పీ మీర్జాపూర్ శ్రీకాంత్ ప్రజాపతి మాట్లాడుతూ.. ఒక మహిళ ఆదివారం కత్రా కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.

తన మైనర్ కుమార్తెను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ 39వ బెటాలియన్‌కు చెందిన పీఏసీ కానిస్టేబుల్‌పై ఎఫ్‌ఐఆర్ ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ సుధీర్ కుమార్ ఆదివారం రాత్రి ఇంటికి వచ్చినట్లు ఆమె చెప్పింది. రాత్రి భోజనం చేసి భర్త అవతలి గదిలో పడుకున్నాడని, ఈ క్రమంలో మద్యం మత్తులో సుధీర్ కుమార్ తన ఎనిమిదేళ్ల కుమార్తెను వేధించాడని చెప్పింది. కూతురి అరుపులు విని లోపలికి వెళ్లి చూసే సరికి సుధీర్ కుమార్ కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆ వెంటనే ఆమె ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న కాట్రా కొత్వాల్ వెంకటేష్ తివారీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తర్వాత సీవో సిటీ పరమానంద్ కుష్వాహా, ఏఎస్పీ సిటీ శ్రీకాంత్ ప్రజాపతి కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరోపణలపై విచారణ చేపట్టారు. దీని తర్వాత మహిళ ఫిర్యాదుపై పోలీసులు సరైమిర్ పోలీస్ స్టేషన్, సరైమిర్ అజంగఢ్‌లో నివసిస్తున్న నిందితుడు కానిస్టేబుల్ సుధీర్ కుమార్‌పై వేధింపుల కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కత్రా కొత్వాలి పోలీసులు వెంటనే సుధీర్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు, తదుపరి చట్టపరమైన లాంఛనాలు, దర్యాప్తు పురోగతిలో ఉందని ఏఎస్పీ తెలిపారు.

Next Story