హైదరాబాద్‌ కేంద్రంగా చైల్డ్ పోర్న్ వీడియోల అప్లోడ్

US tips off about three child porn uploaders from Hyderabad. అమెరికాలోని సైబర్ టిప్‌లైన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో గురువారం హైదరాబాద్‌లో ముగ్గురు చైల్డ్

By అంజి  Published on  7 July 2022 4:39 PM IST
హైదరాబాద్‌ కేంద్రంగా చైల్డ్ పోర్న్ వీడియోల అప్లోడ్

అమెరికాలోని సైబర్ టిప్‌లైన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో గురువారం హైదరాబాద్‌లో ముగ్గురు చైల్డ్ పోర్న్ వీడియో అప్‌లోడర్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సైబర్ టిప్‌లైన్ అనేది చైల్డ్ పోర్నోగ్రఫీ, పిల్లలను ఆన్‌లైన్‌లో లైంగిక చర్యల కోసం ప్రలోభపెట్టడం, పిల్లలను వేధించడం, పిల్లలకు పంపిన అయాచిత అశ్లీల విషయాలతో సహా పిల్లల లైంగిక దోపిడీ కేసుల కోసం ఏర్పాటు చేశారు.

అప్‌లోడ్ చేసిన వీడియోల ఆధారంగా హైదరాబాద్‌లో మూడు ఐపీ అడ్రస్‌లను గుర్తించి వివరాలను తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ)కి అందించారు. సైబర్‌ టిప్‌ లైన్‌ తెలంగాణలో మూడు చైల్డ్‌పోర్న్‌ కేసులను గుర్తించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి చైల్డ్‌ పోర్న్‌ వీడియోస్‌ని అప్‌లోడ్‌ చేస్తున్నట్టు సైబర్‌ టిప్‌ లైన్‌ గుర్తించారు. అప్‌లోడ్‌ చేసిన వీడియోస్ అధారంగా హైదరాబాద్ లో మూడు ఐపి అడ్రేస్ ల ద్వారా చైల్డ్‌ పోర్న్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేసినట్టు గుర్తించింది. ఐపీ అడ్రస్‌ల ద్వారా నేరస్తులను గుర్తించారు హైదరాబాద్ పోలీసులు. రసూల్‌ పురా, టోలిచౌకి, వారాసి గూడా ప్రాంతాల నుంచి వీడియోస్‌ అప్‌లోడ్‌ చేసినట్టు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.

Next Story