అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు మృతి

US road accident kills two master’s students from Hyderabad. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు మరణించారు.

By M.S.R
Published on : 26 April 2023 7:05 PM IST

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు మరణించారు. ఆ ఇద్దరు మాస్టర్స్ కోసం అమెరికాకు వెళ్లారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ముగ్గురు హైదరాబాదీలు కెంటకీలోని జాన్స్‌బర్గ్ హైవేపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మహ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. మూడో విద్యార్థికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స ఇస్తున్నారు. విద్యార్థుల అంత్యక్రియలు అక్కడే నిర్వహించారు. ఇద్దరు ముస్లిం విద్యార్థులకు వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియల ప్రార్థనలు సెయింట్ లూయిస్‌లోని దార్ ఉల్ ఇస్లాం మసీదులో జరిగాయి. అనంతరం మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.


Next Story