హైదరాబాద్‌లో కలకలం.. భార్యను చంపి.. ముక్కలు ముక్కలుగా కట్ చేసిన భర్త

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాలాజీహిల్స్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.

By అంజి
Published on : 24 Aug 2025 8:12 AM IST

హైదరాబాద్‌లో కలకలం.. భార్యను చంపి.. ముక్కలు ముక్కలుగా కట్ చేసిన భర్త

హైదరాబాద్‌: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాలాజీహిల్స్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్య స్వాతిని భర్త మహేందర్‌ రెడ్డి అతి కిరాతకంగా హత్య చేశాడు. రంపంతో కోసి ముక్కలు ముక్కలుగా చేసి మర్డర్‌ చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. వికారాబాద్ కామారెడ్డి గూడ కి చెందిన యాదవ కులానికి చెందిన స్వాతి(22 అలియాస్ జ్యోతి) అనే యువతి, అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అయితే ఈ జంట జీవనోపాధి నిమిత్తం 25 రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బోడుప్పల్ లోని బాలాజీహిల్స్ లో అద్దెకు ఉంటున్నారు. మహేందర్ రెడ్డి రాపిడో నడుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇద్దరీ మధ్య ఏమి జరిగింది అనేది, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇద్దరు ఇదే ప్రాంతంలోని ఇదే ఇంట్లో ఓ పది నెలలు ఉండి వెళ్ళినట్లు స్థానికులు చెప్తున్నారు. మళ్ళీ 25 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వీరు ప్రేమ వివాహం ఎప్పుడూ చేసుకున్నారు అనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాళ్ళు, చేతులు, తల వేరు చేసి ఎక్కడో వేసినట్లు తెలుస్తుంది. అవి ఇంకా పోలీసులకు దొరకనట్లు తెలుస్తుంది. ఛాతీ భాగంలో ఉన్న భాగం మాత్రమే ఉంది. చేతులు భుజాల వరకు, కాళ్ళు గజ్జల వరకు, అలాగే తల కట్ చేసినట్లు సమాచారం. పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Next Story