హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో ఓ కిడ్నాప్ కేసు పోలీసులను షాక్ కు గురిచేసింది. రామంతాపూర్‌కు చెందిన పూర్ణచందర్ మాదాపూర్‌లోని ఓ పబ్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, తొమ్మిదేళ్ల కూతురు ఉన్నారు. ఒకరోజు రాత్రి స్నేహితులు వచ్చారని చెప్పి, కావాలనే తన ఫోన్ ఇంట్లోనే వదిలేసి, ఇంటికి బయటవైపు గడియపెట్టి వెళ్లిపోయాడు. రెండు రోజులైనా భర్త రాకపోవడం, సీసీటీవీ ఫుటేజీలో ఎవరో అతడ్ని కారులో తీసుకెళ్తున్నట్లు ఉండటంతో తన భర్తను కిడ్నాప్ చేశారంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పబ్ నిర్వాహకులు కూడా మిస్సింగ్ కేసు పెట్టారు.
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. పబ్‌లో పనిచేసే ఓ బెంగాలీ యువతితో సహజీవనం చేస్తున్న పూర్ణచందర్, ఆమెతో ఏకాంతంగా గడిపేందుకే ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారి లొకేషన్ ఒడిశాలో ఉన్నట్లు ట్రేస్ చేశారు.