క్షుద్ర పూజ కలకలం.. పసికందు మెడ కోసిన తల్లి

మూఢనమ్మకాలతో కలకలం రేపిన ఘటనలో ఓ మహిళ గురువారం 'క్షుద్ర' కర్మలో భాగంగా పదునైన వస్తువుతో తన పసికందు మెడను కోసింది.

By అంజి
Published on : 9 Feb 2024 12:40 PM IST

UttarPradesh, infant daughter, occult ritual, Crime news

క్షుద్ర పూజ కలకలం.. పసికందు మెడ కోసిన తల్లి

మూఢనమ్మకాలతో కలకలం రేపిన ఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఓ మహిళ గురువారం 'క్షుద్ర' కర్మలో భాగంగా పదునైన వస్తువుతో తన పసికందు మెడను కోసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలైన తల్లి గీత (33) తన రెండు నెలల కుమార్తెపై పదునైన వస్తువుతో దాడి చేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మహిళ మానసిక స్థితి సరిగా లేదని ఆమె భర్త పేర్కొన్నాడు. గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

"ఆమె మానసికంగా అస్థిరంగా ఉందని, క్షుద్ర పద్ధతులను నమ్ముతుందని కుటుంబ సభ్యులు తెలియజేసారు" అని పోలీసు అధికారి తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందని, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి తెలిపారు. మూఢనమ్మకాలతో కూడిన "క్షుద్ర అభ్యాసాల" కేసులు తరచుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి నివేదించబడుతున్నాయి, పిల్లలు తరచుగా ఆ చెడు "ఆచారాల" కారణంగా బలవుతున్నారు.

Next Story