పెళ్లిలో పూల వర్షం కురిపించేందుకు వచ్చిన బాలికపై.. ఇద్దరు గ్యాంగ్ రేప్

పెళ్లికి వచ్చిన అతిథులపై పూల వర్షం కురిపించేందుకు కూలీకి తీసుకొచ్చిన ఓ టీనేజీ బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

By అంజి  Published on  5 March 2024 6:39 AM IST
Uttar Pradesh, shower petals, wedding guests , Crime news

పెళ్లిలో పూల వర్షం కురిపించేందుకు వచ్చిన బాలికపై.. ఇద్దరు గ్యాంగ్ రేప్ 

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన అతిథులపై పూల వర్షం కురిపించేందుకు కూలీకి తీసుకొచ్చిన ఓ టీనేజీ బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటన మార్చి 2న జరిగింది. ఇద్దరు నిందితులు పెళ్లిలో తాండూర్ (వంటకు ఉపయోగిస్తారు) నిర్వహిస్తున్నారు. బాలికను ఇంటికి దింపుతామనే నెపంతో బైక్‌పై తీసుకెళ్లి పొలంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలిక ఇంటికి చేరుకోగా, తనకు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, ఫిర్యాదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story