ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల బాలిక, తన తల్లితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా అత్యాచారానికి గురైంది. ఈ ఘటన ఫిబ్రవరి 4 శుక్రవారం నాడు జరిగింది. వారు తమ ఇంటికి చేరుకోవడానికి మధురలోని డ్రైవర్‌ను లిఫ్ట్ అడిగారు. అయితే కారు డ్రైవర్ వాటర్‌లో మత్తుమందు ఇచ్చి టీనేజ్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంఘటన తర్వాత వారిని నిందితుడు ఫిరోజాబాద్‌లోని రోడ్డుపై పడేశారు. బాధితురాలి ఫిర్యాదు, వైద్య పరీక్షల ఆధారంగా.. పోలీసులు బుధవారం 9 న ఫిరోజాబాద్‌లోని నార్కి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, టీనేజ్ బాలిక, ఆమె తల్లి హర్యానాలో కార్మికులుగా పని చేస్తున్నారు. వారు యూపీలోని తమ ఇంటికి తిరిగి వచ్చి బస్సులో మధుర చేరుకున్నారు.
వారు మరింత ప్రయాణించడానికి బస్సు దొరకకపోవడంతో, వారు మధురలో కారు నుండి లిఫ్ట్ తీసుకున్నారు. నార్కి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. "అమ్మాయి దాహం వేస్తుంది అంటూ నీరు అడిగింది. డ్రైవర్ ఇచ్చిన నీళ్లు తాగిన తల్లీ, బాలిక ఇద్దరూ స్పృహతప్పి పడిపోయారు, ఆ తర్వాత డ్రైవర్ బాలికపై అత్యాచారం చేశాడు. మంగళవారం సాయంత్రం మాకు ఫిర్యాదు అందింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376, 328 కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రాణాలతో బయటపడిన బాధితురాలు కారు డ్రైవర్ పేరు చెప్పాడని, అయితే కారు రిజిస్ట్రేషన్ నంబర్ తల్లి, అమ్మాయి ఇద్దరికీ తెలియదని పోలీసులు తెలిపారు. పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు, సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.