మైనర్ బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. నగ్నంగా ఇంటికి వెళ్లిన బాధితురాలు.. వీడియో వైరల్‌

UP Minor gang-rape victim walks home unclothed in video viral. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. మైనర్‌ బాలికను ఐదుగురు వ్యక్తులు కి

By అంజి  Published on  22 Sept 2022 3:47 PM IST
మైనర్ బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. నగ్నంగా ఇంటికి వెళ్లిన బాధితురాలు.. వీడియో వైరల్‌

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. మైనర్‌ బాలికను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత అత్యాచారానికి గురైన 15 ఏళ్ల బాలిక మొరాదాబాద్‌ - ఠాకూర్‌ద్వారా రోడ్డుపై నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లింది. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. బాలికకు సహాయం చేయడానికి బదులుగా, కొంతమంది బాటసారులు మూగ ప్రేక్షకులుగా నిలబడి ఉండిపోయారు. మరికొందరు ఆమె నగ్నంగా నడుస్తుండగా.. తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకున్నారు.

తెలిసిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన 15 రోజుల క్రితం జరిగింది, అయితే వైరల్ వీడియో ఇప్పుడు బయటపడింది. బాలిక మేనమామ మాట్లాడుతూ, "ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతోంది. తనకు జరిగిన బాధను వివరించింది." అని చెప్పారు. ఆ తర్వాత అతను ఫిర్యాదు చేయడానికి పోలీసులను ఆశ్రయించాడు. అయితే అతను జిల్లా పోలీసు హెడ్ SSP హేమంత్ కుటియాల్ ముందు ఈ విషయాన్ని లేవనెత్తే వరకు పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు.

సెప్టెంబర్ 7న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులు చర్యకు దిగారు. ఒక నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి కుటుంబ సభ్యులు తనను చంపుతామని బెదిరించారని ఫిర్యాదుదారు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

మొరాదాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక పొరుగు గ్రామంలో జరిగే జాతరకు హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలో ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేయడానికి ఆమెను కిడ్నాప్ చేశారు. ఆమె అరుపులు విన్న గ్రామస్థుడు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు, అయితే అప్పటికి ఐదుగురు నిందితులు ఆమె బట్టలు, ఇతర వస్తువులను తీసుకొని అక్కడి నుండి పారిపోయారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) సందీప్ కుమార్ మీనా మాట్లాడుతూ.. "సెక్షన్ 376డి (గ్యాంగ్ రేప్), పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. సెప్టెంబర్ 15న నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశాము. తదుపరి విచారణ కొనసాగుతోంది" అని చెప్పారు.


Next Story