ప్రైవేట్‌ వీడియోలతో బ్లాక్‌మెయిల్‌.. బాలిక ఆత్మహత్య

ఇద్దరు యువకులు అత్యాచారం చేసేందుకు యత్నించడంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పరిధిలో జరిగింది.

By అంజి  Published on  16 Oct 2023 8:24 AM GMT
suicide, Crime news, Uttar Pradesh, Agra

ప్రైవేట్‌ వీడియోలతో బ్లాక్‌మెయిల్‌.. బాలిక ఆత్మహత్య

ఇద్దరు యువకులు అత్యాచారం చేసేందుకు యత్నించడంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలు స్నానం చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరించిన నిందితులు, ఆ వీడియో చూపించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పరిధిలోని ఖేరాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో చోటుచేసుకుంది.

శనివారం ఖేరాఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 19 ఏళ్ల యువతి మృతదేహం తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. ఈ విషయమై బాలిక తండ్రి ఆదివారం ఖేరాగఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రహస్యంగా తీసిన అసభ్యకర వీడియోలను చిత్రీకరించిన తర్వాత ఆ యువకులు తన కుమార్తెను బ్లాక్‌మెయిల్ చేశారని బాలిక తండ్రి ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. గదిలో లభించిన సూసైడ్ నోట్‌ను కూడా బాలిక తండ్రి పోలీసులకు అందజేశారు.

రెండు రోజుల క్రితం నిందితులిద్దరూ తమ ఇంట్లోకి ప్రవేశించి తన కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. యువతి అడ్డు చెప్పడంతో నిందితులు ఆమెను కొట్టడంతో పాటు మెడపై కత్తి కూడా పెట్టారు. వారి ప్రవర్తనతో విసిగిపోయిన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ ఖేరగఢ్‌ మహేశ్‌కుమార్‌ తెలిపారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. బాలిక మృతదేహం శనివారం ఆమె ఇంట్లో లభ్యమైంది. ఆదివారం బాలిక తండ్రి ఖేరాగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చాలా కాలంగా తన కూతురిని ఇరుగుపొరుగు అభిషేక్, విష్ణు నిరంతరం వేధిస్తున్నారని తండ్రి ఆరోపించాడు. నిందితుడు తన కూతురు స్నానం చేస్తుండగా వీడియో కూడా తీశారని ఆరోపించారు. అక్టోబర్ 13న అభిషేక్, విష్ణు టెర్రస్ గుండా ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. బాలిక అడ్డు చెప్పడంతో ఆమెను కొట్టారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై 323, 354, 452, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ ఖేరాఘర్ మహేశ్ కుమార్ తెలిపారు.

Next Story