ఓ ఫ్లాట్‌లో యువతి అనుమానాస్పద మృతి.. కుళ్లిన స్థితిలో మృతదేహం
Unidentified woman found dead in a flat in Hyderabad. హైదరాబాద్ నగర పరిధిలోని చింతల్‌మెట్‌లో గల ఓ అపార్ట్‌మెంట్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి
By అంజి Published on
16 Jan 2022 5:46 AM GMT

హైదరాబాద్ నగర పరిధిలోని చింతల్‌మెట్‌లో గల ఓ అపార్ట్‌మెంట్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్‌లో నుండి దుర్వాసన రావడంతో.. అపార్ట్‌మెంట్ వాసులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే యువతి ఆత్మహత్యకు పాల్పడిందా.. లేదా హత్యకు గురైందా అన్న విషయాలు ఇంకా తెలియరాలేదు.
అత్తాపూర్‌లోని చింతల్‌మెట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో శనివారం రాత్రి కుళ్లిపోయిన స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసులు చెప్పారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తమకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా ఓ గదిలో యువతి మృతదేహం కనిపించింది. ఇంట్లో కొందరు వ్యక్తులు పార్టీ చేసుకున్నట్లు తెలిపే కథనాలను కూడా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత యువతి ఎలా మృతి చెందిందన్న వివరాలు తెలియనున్నాయి.
Next Story