ఢిల్లీలో కాల్పుల మోత.. నడిరోడ్డుపై అన్నాదమ్ములను వెంబడించి మ‌రీ

Unidentified suspects opens fire at a car in delhi.అత్యంత ర‌ద్దీగా ఉన్న ర‌హ‌దారిపై ఓ ముగ్గురు దుండ‌గులు ఓ కారుపై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2022 3:05 PM IST
ఢిల్లీలో కాల్పుల మోత.. నడిరోడ్డుపై అన్నాదమ్ములను వెంబడించి మ‌రీ

అత్యంత ర‌ద్దీగా ఉన్న ర‌హ‌దారిపై ఓ ముగ్గురు దుండ‌గులు ఓ కారుపై కాల్పులు జ‌రిపారు. దాదాపు 10 రౌండ్ల‌కు పైగా కాల్పులు జ‌రిపిన‌ప్ప‌టి.. అంద‌రూ చూస్తూ ఉన్నార‌నే త‌ప్ప ఏ ఒక్క‌రూ వారిని ఆపే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు అన్నాద‌మ్ములు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. ఆసుపత్రిలో ఉన్న బంధువులను చూసి వచ్చేందుకు కేశోపూర్ మండి మాజీ చైర్మన్ అజయ్ చౌదరీ, అతడి సోదరుడు జస్సా చౌదరీ శ‌నివారం రాత్రి కారులో వెలుతున్నారు. సుభాష్‌ నగర్‌లోని శాంతిన‌గ‌ర్ రోడ్డు వ‌ద్ద ముగ్గురు దుండ‌గులు వీరి కారుపై కాల్పులు జ‌రిపారు. కాల్పుల నుంచి సోద‌రులు త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసినా.. దుండ‌గులు వెంబ‌డించి మ‌రీ తుపాకుల‌తో కాల్పారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన సోద‌రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. మొత్తం 10 రౌండ్లు కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీ కెమెరాల్లోని రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితుల‌ను గుర్తించే ప‌నిలో ఉన్నారు. పాత క‌క్ష‌లే కాల్పుల‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు బావిస్తున్నారు.


Next Story