నెల్లూరు జిల్లాలో దారుణం.. విదేశీ యువతిపై అత్యాచారయత్నం

Unidentified Mens misbehaves with Foreign Woman.ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి దేశంలో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2022 7:30 PM IST
నెల్లూరు జిల్లాలో దారుణం.. విదేశీ యువతిపై అత్యాచారయత్నం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి దేశంలో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. అంత‌ర్జాయ మ‌హిళా దినోవ‌త్సం నాడు దారుణ ఘ‌ట‌న వెలుగుచూసింది. కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వచ్చిన విదేశీ యువతిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో క‌ల‌క‌లం రేపింది.

వివ‌రాల్లోకి వెళితే.. బ్రిట‌న్‌లోని లితోనియాకు చెందిన ఓ యువ‌తి (25) కృష్ణపట్నం పోర్టు సంద‌ర్శ‌న‌కు వ‌చ్చింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం సైదాపురం స‌మీపంలోని రాపూరు రోడ్డులో ప్ర‌యాణిస్తుండ‌గా.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెపై అత్యాచారానికి య‌త్నించారు. అయితే.. ఆమె వారిని ప్ర‌తిఘ‌టించింది. కేక‌లు వేసుకుంటూ రోడ్డుపైకి చేరుకుంది. ప్ర‌యాణీకులు ఆమె కేక‌లు విని ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లే స‌రికి దుండ‌గులు అక్క‌డి నుంచి ప‌రారు అయ్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని యువ‌తికి ర‌క్ష‌ణ క‌ల్పించారు. యువ‌తి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆమె చెప్పిన వివ‌రాల ఆధారంగా రాపూరు అట‌వీ ప్రాంతంలో దుండ‌గుల కోసం గాలింపు చేప‌ట్టారు. కాగా.. క్యాబ్ డ్రైవ‌ర్‌తో పాటు మ‌రికొంత మంది యువ‌తిపై అత్యాచార య‌త్నానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

Next Story