దసరాకు భర్త కొత్త చీర కొనలేదని.. భార్య ఆత్మహత్య

జార్ఖండ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త కొత్త చీర కొనకపోవడంతో మనస్తాపానికి గురైన మహిళ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది.

By అంజి  Published on  13 Oct 2024 10:00 AM IST
saree, Dussehra, woman kills self, Jharkhand , Crime

దసరాకు భర్త కొత్త చీర కొనలేదని.. భార్య ఆత్మహత్య

జార్ఖండ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త కొత్త చీర కొనకపోవడంతో మనస్తాపానికి గురైన మహిళ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం దుమ్కా జిల్లాలోని బాగ్‌జోపా గ్రామంలో 26 ఏళ్ల మహిళ రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు సెండో దేవి, దసరా సందర్భంగా తన భర్త తనకు చీర బహుమతిగా ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

"మహిళ దసరా కోసం కొత్త చీరను అడిగింది. కానీ ఆమె భర్త, ట్రాక్టర్ డ్రైవర్ కోపం తెచ్చుకున్నాడు. ఇది ఆమె తీవ్ర చర్యకు దారితీసింది," అని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఆమె ఇద్దరు మైనర్ పిల్లలకు తల్లి అని ఆయన చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారి తెలిపారు.

Next Story