ఇద్దరు అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌రేప్‌.. బీజేపీ నేత కొడుకు సహా 10 మంది అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రక్షా బంధన్ జరుపుకుని తిరిగి వస్తుండగా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది

By అంజి  Published on  3 Sept 2023 6:18 AM IST
Chhattisgarh, BJP leader son, Crime news, Raipur

ఇద్దరు అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌రేప్‌.. బీజేపీ నేత కొడుకు సహా 10 మంది అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి కాబోయే భర్తతో కలిసి రక్షా బంధన్ జరుపుకుని తిరిగి వస్తుండగా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది. పది మంది దుండగులు వారి మార్గాన్ని బలవంతంగా అడ్డుకుని భీకరదాడికి పాల్పడడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. ముగ్గురు నిందితులు.. అక్కాచెల్లెళ్లు ఇంటికి తిరిగి వెళ్తుండగా వారిని మొదట అడ్డగించారు. ముగ్గురూ నగదు, మొబైల్ ఫోన్లు దోచుకెళ్లారు. మిగిలిన ఏడుగురు నిందితులు నాలుగు ద్విచక్రవాహనాలపై సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఆ తర్వాత నిందితులు ఇద్దరు అక్కాచెల్లెళ్లను ప్రధాన రహదారికి దూరంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు బాలికలతో పాటు వచ్చిన వ్యక్తి కూడా తీవ్ర శారీరక హింసకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక బీజేపీ నాయకుడి కుమారుడు సహా పది మందిని అరెస్టు చేశారు. నిందితులలో నేర కార్యకలాపాల చరిత్ర కలిగిన వ్యక్తులు ఉన్నారు. ప్రధాన అనుమానితుల్లో ఒకరైన పూనమ్ ఠాకూర్ ఇటీవల ఆగస్టు 2023లో బెయిల్‌పై విడుదలయ్యారు. పూనమ్ ఠాకూర్ స్థానిక బిజెపి నాయకుడు లక్ష్మీ నారాయణ్ సింగ్ కుమారుడు.

Next Story