ఇటుక బట్టీలో బాలికపై అత్యాచారం, సజీవ దహనం.. ఇద్దరికి మరణశిక్ష

14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు సోదరులకు రాజస్థాన్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది.

By అంజి  Published on  20 May 2024 2:45 PM
Rajasthan, Crime,  Bhilwara

ఇటుక బట్టీలో బాలికపై అత్యాచారం, సజీవ దహనం.. ఇద్దరికి మరణశిక్ష

గత ఏడాది భిల్వారా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు సోదరులకు రాజస్థాన్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. తన గ్రామంలో పశువులను మేపుతుండగా తప్పిపోయిన కొన్ని గంటల తర్వాత బాధితురాలి అవశేషాలు ఇటుక బట్టీలో లభ్యమయ్యాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహావీర్ సింగ్ కిష్నావత్ మాట్లాడుతూ.. 2023 ఆగస్టులో జరిగిన నేరానికి నిందితులు కలు లాల్, అతని సోదరుడు కన్హాను పోక్సో కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఆ తర్వాత వారికి మరణశిక్ష విధించబడింది.

ఈ కేసులో మరో ఏడుగురు నిందితులను కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిర్దోషిగా విడుదల చేయడాన్ని హైకోర్టులో సవాలు చేస్తామని కిష్ణావత్ తెలిపారు. కొలిమిలో పడేయడానికి ముందు బాలిక బతికే ఉందని ఫోరెన్సిక్ ఆధారాలను కోర్టు ఆధారం చేసుకుంది.

కేసు ఏమిటి?

ఆగస్టు 2న పొలాల్లో మేకలను మేపేందుకు వెళ్లిన 14 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. అదే రోజు రాత్రి నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి మృతదేహాన్ని కాల్చి వేశారు. ఆమె కుటుంబ సభ్యులు వెతకగా, బాలిక బ్రాస్‌లెట్, చెప్పులు బాలికను దహనం చేసిన దగ్గర మండుతూ కనిపించాయి.

సెర్చ్ ఆపరేషన్ తరువాత, ఆగస్టు 4 న గ్రామంలోని చెరువు నుండి సగం కాలిపోయిన శరీర భాగాలను, మృతురాలిదే అని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్ శరీర భాగాలలో కొన్నింటిని కొలిమిలో కాల్చివేయగా, ఇతర భాగాలను అన్ని సాక్ష్యాలను నాశనం చేయడానికి సమీపంలోని చెరువులో పారవేయడం జరిగిందని వారు ఆరోపించారు. దీనిని "అరుదైన కేసు"గా పేర్కొన్న భిల్వారా ఎస్పీ ఆదర్శ్ సిద్ధూ నిందితులకు మరణశిక్ష విధించేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.

" ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు సహా పది మంది నిందితులు ఈ నేరంలో పాల్గొన్నారు " అని ఆయన చెప్పారు.

Next Story