ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు దుర్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

By Medi Samrat
Published on : 20 Sept 2023 7:21 PM IST

ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు దుర్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తొర్రూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని కంచనపల్లి బొడ్డుగూడెం సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చుక్క యాకమ్మ(56) , కొండ రాములు (51) అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. మృతుడు కొండ రాములు మండల పరిధిలోని కోటమర్తి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

Next Story