PVNR ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ యాక్సిడెంట్

శుక్రవారం నాడు హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ వద్ద PVNR ఎక్స్‌ప్రెస్‌వేపై కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో కారును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు

By Medi Samrat  Published on  9 Aug 2024 7:30 PM IST
PVNR ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ యాక్సిడెంట్

శుక్రవారం నాడు హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ వద్ద PVNR ఎక్స్‌ప్రెస్‌వేపై కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో కారును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మెహదీపట్నం వైపు వెళ్తున్న కారు డ్రైవర్ అదుపు తప్పి పిల్లర్ నెం.294 సమీపంలో ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కారు అదుపుతప్పి కొన్ని మీటర్ల దూరం దూసుకెళ్లింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు కార్లు భారీగా దెబ్బతిన్నాయని, ఈ ఘటనతో ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ జామ్ అయ్యిందని పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Next Story