హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థినిపై ఇద్దరు అత్యాచారం.. మద్యం తాగించి..

హైదరాబాద్‌ నగరంలో దారుణం జరిగింది. ఇంటర్న్‌షిప్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన చెన్నైకి చెందిన 20 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం జరిగింది.

By అంజి
Published on : 13 May 2025 6:48 AM IST

Two Hyderabad men, arrest, Chennai intern, Crime

హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థినిపై ఇద్దరు అత్యాచారం.. మద్యం తాగించి..

హైదరాబాద్‌ నగరంలో దారుణం జరిగింది. ఇంటర్న్‌షిప్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన చెన్నైకి చెందిన 20 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో బాధితురాలి స్నేహితుడు సహా ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఈ సంఘటన మే 3న జరగగా, ఆ మహిళ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫైనల్ ఇయర్ బయోమెడికల్ విద్యార్థిని అయిన ఆ మహిళ నిందితులతో కలిసి ఒక పార్టీకి హాజరై, అక్కడ మద్యం సేవించింది. ఆ రాత్రి ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

మరో సంఘటనలో, తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పన్నెండు మందిని, వారిలో సగం మంది మైనర్లను అరెస్టు చేశారు. కడుపు నొప్పిగా ఉందని బాలిక ఫిర్యాదు చేయడంతో ఆమె తల్లి ఆమెను చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో లైంగిక దాడి జరిగినట్లు తేలింది. అక్కడ వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించారు. ఆసుపత్రి వారు పల్లవరం పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చెన్నైలోని పల్లవరం ప్రాంతంలోని తన ఇంట్లో ఒంటరిగా ఉండే బాలికతో నిందితుల్లో ఒకరు స్నేహం చేశాడు. ఆ తర్వాత, ఆమె తల్లిదండ్రులు పనిలో ఉన్నప్పుడు ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరువాత తన స్నేహితులను కూడా తీసుకొచ్చి ఆమెపై దాడి చేశాడు. నిందితులు చేసిన ఆరోపణల ఆధారంగా, బాలిక తల్లిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story