రష్యన్ మహిళ నిద్రిస్తుండగా కిటికీ గుండా గదిలోకి వెళ్లి..

Two hotel staffers arrested for assaulting Russian woman in Goa. ఉత్తర గోవాలోని మోర్జిమ్‌లో 30 ఏళ్ల రష్యన్ మహిళ టూరిస్ట్‌ను దోచుకునే ప్రయత్నంలో దాడి చేసినందుకు

By M.S.R  Published on  26 March 2023 6:00 PM IST
రష్యన్ మహిళ నిద్రిస్తుండగా కిటికీ గుండా గదిలోకి వెళ్లి..

Two hotel staffers arrested for assaulting Russian woman in Goa


పనాజీ : ఉత్తర గోవాలోని మోర్జిమ్‌లో 30 ఏళ్ల రష్యన్ మహిళ టూరిస్ట్‌ను దోచుకునే ప్రయత్నంలో దాడి చేసినందుకు ఇద్దరు హోటల్ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఐగుల్ దావ్లెటియానోవా (30) దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఆమె నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు ఇద్దరు వ్యక్తులు కిటికీలోంచి ఆమె హోటల్ గదిలోకి ప్రవేశించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఆమె మేల్కొనే సమయానికి నిందితులు ఆమె చేతులను పట్టుకుని, ఆమె నోటిని మూసి వేయడానికి ప్రయత్నించారు. ఈ పెనుగులాటలో ఆమెకు గాయాలయ్యాయి. ఆమె ప్రతిఘటించడంతో ఆ ఇద్దరు నిందితులు పారిపోయారని అధికారి తెలిపారు. గ్రాండ్ ఇన్ హోటల్ సిబ్బంది అందరినీ విచారించారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెయిటర్‌గా పనిచేస్తున్న అభినాష్ గోరియా (29), హోటల్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మహమ్మద్ ఖాన్ (26) నేరం ఒప్పుకున్నారని ఉత్తర గోవా పోలీసు సూపరింటెండెంట్ నిధిన్ వల్సన్ అన్నారు. ఇద్దర్నీ అరెస్టు చేశామని తెలిపారు.


Next Story