ఇద్దరి ప్రాణాలు తీసిన సెల్ఫీ పిచ్చి

Two drown while taking selfie at dindi. సెల్ఫీ సరదా ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. డిండి నీటి ప్రాజెక్ట్‌లో పడి ఇద్దరు యువకులు

By అంజి  Published on  17 Oct 2021 7:28 PM IST
ఇద్దరి ప్రాణాలు తీసిన సెల్ఫీ పిచ్చి

సెల్ఫీ సరదా ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. డిండి నీటి ప్రాజెక్ట్‌లో పడి ఇద్దరు యువకులు తమ ప్రాణాలను విడిచారు. శ్రీశైలం మల్లిఖార్జునస్వామి దర్శనానికి వెళ్లిన ఇద్దరు స్నేహితులు.. తిరుగుపయనంలో డిండి ప్రాజెక్ట్‌ వద్ద ఆగారు. ఈ క్రమంలో ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో జారిపడ్డారు. ఇద్దరికి కూడా స్విమ్మింగ్‌ రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయారు. అక్కడే ఉన్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. అక్కడున్న కొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులను ప్రాజెక్ట్‌ నుండి బయటకి తీశారు.

అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణానికి చెందిన సాగర్‌, ప్రవీణ్‌గా గుర్తించారు. ఇద్దరు స్నేహితులు ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఆ గ్రామంలో, వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న వారిలో కొందరికి సెల్ఫీ ఒక వ్యసనమైంది. కొంతమంది యువత అత్యుత్సాహాంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వాగులు, వంకల్లో సెల్పీల కోసం ఆరాటపడుతూ ప్రాణాలు వదులుకుంటున్నారు.

Next Story