హైదరాబాద్‌లోని నార్సింగి మరియు మల్లేపల్లి ప్రాంతాల్లో శనివారం జరిగిన వేర్వేరు సంఘటనలలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు.
మొదటి కేసులో.. 29 ఏళ్ల కార్తీక్ అనే వ్యాపారవేత్త రుణాలు తిరిగి చెల్లించలేకపోవడంతో ఆర్థిక సమస్యల కారణంగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సింగి పోలీసు పరిధిలోని పుప్పాలగూడలోని తన నివాసంలో కార్తీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నార్సింగి పోలీసులు వ్యాపారవేత్త నివాసంలో ఒక సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. "నా మరణానికి ఎవరూ కారణం కాదు. నేను అప్పులు తిరిగి చెల్లించలేకపోవడంతో నా జీవితాన్ని ముగించుకుంటున్నాను" అని నోట్‌లో ఉంది.
రెండవ కేసులో.. మల్లేపల్లిలోని తన ఇంట్లో ఒక డ్రైవర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని మల్లేపల్లిలోని ఫీల్‌ఖానాకు చెందిన మహ్మద్ రంజాన్ (60) గా గుర్తించారు. అతని భార్య పని మీద ఇంటి నుండి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రంజాన్ మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.