రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురు దుర్మరణం
Two Bikes Hits 3 persons died in Adilabad District.ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైక్‌లు
By తోట వంశీ కుమార్ Published on
25 Dec 2021 3:14 AM GMT

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైక్‌లు ఢీ కొని ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఉట్నూరు మండలం కుమ్మరి తండా వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు తడిహత్నూర్‌కు, మరొకరు పెరికగూడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story