స్కూల్ టీచర్‌పై అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్

Two arrested for sexually assaulting a school teacher in Mumbai. మహారాష్ట్రలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని రాయ్‌గఢ్ జిల్లా తలోజాలో గుజరాత్‌కు చెందిన

By అంజి  Published on  25 Feb 2022 3:57 PM IST
స్కూల్ టీచర్‌పై అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్

మహారాష్ట్రలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని రాయ్‌గఢ్ జిల్లా తలోజాలో గుజరాత్‌కు చెందిన 21 ఏళ్ల టీచర్‌పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. రిపోర్టు ప్రకారం.. నిందితులను అయూబ్ ఇద్రిస్ ఖాన్ (21), షాబాజ్ జహీర్ అలీ (20)గా గుర్తించారు. కాగా బాధితురాలిపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలికి ఐదు నెలల క్రితం సోషల్ మీడియాలో నిందితులలో ఒకరైన ఇద్రిస్‌ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చాటింగ్‌లో వారి పరిచయం కాస్తా స్నేహంగా మారింది.

ఇద్రిస్‌ ఖాన్ తన పుట్టినరోజుకు టీచర్‌ను ఆహ్వానించిన తర్వాత వారు మంగళవారం మొదటిసారి కలుసుకున్నారు. "బాధితురాలు బాంద్రా రైల్వే స్టేషన్‌లో దిగింది. నిందితులు ఆమెను అక్కడ కలుసుకున్నారు. టాక్సీలో ఆమెను తలోజాకు తీసుకువచ్చారు" అని సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ గిరిధర్ గోర్ తెలిపారు. ఇద్రిస్‌ ఖాన్ బాధితురాలిని తలోజాలోని తన స్నేహితుడు అలీ ఫ్లాట్‌కి తీసుకెళ్లి ఆమెకు తాగడానికి బీరు ఇచ్చాడు. పానీయం అందించిన తర్వాత.. ఇద్రిస్‌ ఖాన్ బాధితురాలిపై అత్యాచారం చేశాడు. జహీర్‌ అలీ ఆమెను వేధించాడు.

మహిళ తనను తాను ఎలాగోలా రక్షించుకుని, ఫ్లాట్ నుండి పారిపోయింది. ఆ తర్వాత పోలీస్‌ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. "బాధితురాలు నిందితుడి మొబైల్ నంబర్, అతని ఫోటో యొక్క వివరాలను కలిగి ఉన్నందున, మేము సాంకేతిక పరిశోధనలు ప్రారంభించాము. నిందితులు పన్వెల్‌లో ఉన్నారని కనుగొన్నాము" అని గోర్ చెప్పారు. నిందితులు మధ్యప్రదేశ్‌లోని స్వగ్రామానికి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకున్నామని పోలీసు అధికారి తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Next Story