భద్రాద్రి జిల్లాలో దారుణం.. మహిళా సర్పంచ్‌పై అత్యాచారం.. చివరికి

Twist in komatipalli sarpanch suicide case. మహిళ సర్పంచ్‌పై కన్నేశాడో కామాంధుడు. అవకాశం కోసం వేచి.. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో

By అంజి  Published on  5 Aug 2022 8:40 AM GMT
భద్రాద్రి జిల్లాలో దారుణం.. మహిళా సర్పంచ్‌పై అత్యాచారం.. చివరికి

మహిళ సర్పంచ్‌పై కన్నేశాడో కామాంధుడు. అవకాశం కోసం వేచి.. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారం చేశాడు. దీంతో అవమానం భరించలేక మహిళ సర్పంచ్‌ ఆత్మహత్యకు యత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి కన్నుమూసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం కోమటిపల్లి తండాలో చోటు చేసుకుంది. మహిళా సర్పంచ్‌ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. తండాలోని గుగులోత్ బుజ్జి సాయంతో భూక్య నవీన్ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం బుజ్జి నివాసం వద్ద సర్పంచ్‌పై అత్యాచారం చేశాడు. అయితే ఇది చూసిన మరో వ్యక్తి తండా వాసులకు, బాధితురాలి భర్తకి సమాచారం అందించాడు. దీంతో భర్త అక్కడికి వచ్చి భార్యను తీసుకొని వెళ్ళాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనతో అవమానంగా భావించిన సర్పంచ్ భూక్యా కుమారి విషం తాగింది.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొత్తగూడెం ఆసుపత్రి అట్నుంచి హైదరాబాద్‌కి తరలించారు. హైదరాబాదులో చికిత్స పొందుతూ సర్పంచ్‌ భూక్యా కుమారి నిన్న మృతి చెందింది. సర్పంచ్ తల్లి దారవత్ సైదమ్మ సుజాతనగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవీన్‌, బుజ్జిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. మహిళా సర్పంచ్‌ పైనే ఇంతటి దురాగతానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story
Share it