Hyderabad: ప్రముఖ టీవీ నటి ఇంట్లో చోరీ.. బంగారం, వజ్రాలు మాయం

హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలోని ప్రముఖ టీవీ ఆర్టిస్ట్‌ సుమిత్రా పంపన ఫ్లాట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు బంగారం,

By అంజి  Published on  20 April 2023 3:00 PM IST
Hyderabad, TV artist, Crime, Gold Robbery, Dimond

Hyderabad: ప్రముఖ టీవీ నటి ఇంట్లో చోరీ.. బంగారం, వజ్రాలు మాయం

హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలోని ప్రముఖ టీవీ ఆర్టిస్ట్‌ సుమిత్రా పంపన ఫ్లాట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. ఏప్రిల్ 18 మంగళవారం ఆమె ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన జరిగింది. నటి సుమిత్రా వ్యక్తిగత పని కోసం ఢిల్లీకి వెళ్లారు. అదే సమయంలో ఆమె ఫ్లాట్‌లో సుమారు 1.2 కిలోల (కేజీలు) బంగారు, వజ్రాభరణాలు, 293 గ్రాముల వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్ర తన ఫ్లాట్‌కు తాళం వేసి తాళం వేసి తాళాలను అదే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉంటున్న తన కోడలికి అప్పగించింది. మంగళవారం ఫ్లాట్ మెయిన్ డోర్ గొళ్లెం పగులగొట్టి ఉండడాన్ని సుమిత్ర కోడలు గుర్తించింది. ఆమె వెంటనే సుమిత్ర సోదరుడు విజయ్ కుమార్‌కు సమాచారం అందించింది. అతను నేరం జరిగిన స్థలాన్ని మొత్తం ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు.

బుధవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సుమిత్ర ఫ్లాట్‌లో ఉండాల్సిన బంగారం, వజ్రాభరణాలతో పాటు అల్మీరా లాకర్‌లో ఉంచిన మేనల్లుడు బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు 457, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story