అదనపు తరగతుల నెపంతో దారుణం.. అక్కాచెల్లలపై ట్యూటర్‌ అత్యాచారం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం జరిగింది. మైనర్‌తో సహా ఇద్దరు సోదరీమణులపై అత్యాచారం చేసినందుకు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on  9 Dec 2024 8:55 AM IST
అదనపు తరగతుల నెపంతో దారుణం.. అక్కాచెల్లలపై ట్యూటర్‌ అత్యాచారం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం జరిగింది. మైనర్‌తో సహా ఇద్దరు సోదరీమణులపై అత్యాచారం చేసినందుకు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోచింగ్ సెంటర్‌లోనే ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు వీరేంద్ర త్రిపాఠి అదనపు తరగతులు ఇప్పిస్తానంటూ అక్కాచెల్లెళ్లను ప్రలోభపెట్టాడు. అనంతరం వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మైనర్‌ అయిన చెల్లెలుపై మొదట దాడి చేశాడని, ఆ తర్వాత ఆమె అక్కపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అత్యాచారానికి గురై వారు శనివారం సాయంత్రం తమ కుటుంబ సభ్యులకు జరిగిన దారుణ ఘటనను వెల్లడించారు. కుటుంబ సభ్యులు వెంటనే చోలా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు, దీంతో వెంటనే పోలీసు విచారణ చేపట్టారు. అనంతరం అక్కాచెల్లెళ్లను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. నిందితుడు, అరెస్టును ఊహించి, తన ఇంటి నుండి పారిపోయాడు. అయితే, పోలీసులు వేగంగా చేసిన ఆపరేషన్ అతన్ని పట్టుకోవడానికి దారితీసింది. పోలీసులు ఇప్పుడు ఇతర బాధితుల అవకాశాలను పరిశీలిస్తున్నారు. సమాచారం ఉన్న ఎవరైనా ముందుకు రావాలని కోరారు.

నిందితుడిపై అత్యాచారం, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంతో సహా భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

Next Story