హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హృదయ విదారక ఘటన బయటపడింది. చదవడం లేదని ఓ ట్యూషన్ టీచర్ ఏడేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఓయూ కాలనీకి చెందిన మొదటి తరగతి విద్యార్థి వల్లు తేజ నందన్‌పై ట్యూషన్ టీచర్ శ్రీ మానస అట్లకాడతో విచక్షణరహితంగా కొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. చేతులు, కాళ్లు, ముఖంపై మొత్తం ఎనిమిది చోట్లగా అట్లకాడతో కాల్చినట్టు బాలుడు తల్లిదండ్రులకు తెలిపాడు.
బాలుడి శరీరం మీద గాయాలు చూసిన తల్లిదండ్రులు షాక్‌కు గురై వెంటనే ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుడిని అట్లకాడతో దారుణంగా కాల్చిన టీచర్ శ్రీ మానసపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దాడి వల్ల చిన్నారి తేజ నందన్ ప్రస్తుతం నడవలేని స్థితికి చేరుకున్నట్టు తెలుస్తోంది.