వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు హత్యకు గురికావడం సంచలనం రేపింది. యాదయ్య (38) అనే వ్యక్తి భార్య అలవేలు 32, కుమార్తె శ్రావణి 10, వదిన హన్మమ్మ (40) లను కొడవలితో హత్య చేసి తాను కూడా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఈ ట్రిపుల్ మర్డర్లకు కుటుంబ కలహాలే కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యాదయ్య అనే వ్యక్తి భార్యను, చిన్న కుమార్తె, వదినను కత్తితో హత్య చేశాడు. అయితే పెద్ద కుమార్తెను చంపడానికి ప్రయత్నం చేయడంతో ఆ అమ్మాయి తప్పించుకుంది. తర్వాత యాదయ్య కూడా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం..అని పోలీసులు తెలిపారు.