దారుణం.. రెండో భార్యను 50కి పైగా ముక్కలుగా నరికిన భర్త.. ఎలక్ట్రిక్ కట్టర్‌తో..

Tribal woman hacked into more than 50 pieces in Jharkhand. జార్ఖండ్‌లో మరో దారుణం బయటపడింది. బోరియో పోలీస్ స్టేషన్ పరిధిలోని జార్ఖండ్‌లోని సాహెబ్‌

By అంజి  Published on  18 Dec 2022 9:22 AM GMT
దారుణం.. రెండో భార్యను 50కి పైగా ముక్కలుగా నరికిన భర్త.. ఎలక్ట్రిక్ కట్టర్‌తో..

ఆమె లైవ్-ఇన్ భాగస్వామి అఫ్తాబ్ అమీన్ పూనావాలా చేత గొంతు కోసి 35 ముక్కలుగా నరికి చంపబడిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే, జార్ఖండ్‌లో మరో దారుణం బయటపడింది. బోరియో పోలీస్ స్టేషన్ పరిధిలోని జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌లో తన భార్య మృతదేహాన్ని 50 ముక్కలుగా నరికినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇప్పటి వరకు 18 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే వివాహం చేసుకున్న నిందితుడు, బాధితురాలు గత రెండేళ్లుగా లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. నిందితుడు, మహిళను హత్య చేసిన తర్వాత, అరెస్టు నుండి తప్పించుకునే ప్రయత్నంలో మిస్సింగ్ ఫిర్యాదు చేయడానికి పోలీసులను ఆశ్రయించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 6:00 గంటలకు సంతాలీ మోమిన్ తోలా ప్రాంతంలోని పాత ఇంటిలో ఒక మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నిందితుడు మహిళను ప్రలోభపెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రుబికా పహాడిన్ అనే బాధితురాలిని ఆమె భర్త దిల్దార్ అన్సారీ హత్య చేసినట్లు తెలిసింది. మహిళ కుటుంబ సభ్యులు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది, దర్యాప్తులో భాగంగా రూబికా ఛిద్రమైన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేసు ఎలా తెరపైకి వచ్చింది?

బోరియో సంతాలి గ్రామంలో నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం వెనుక నుండి ఒక మనిషి కాలు, ఇతర శరీర భాగాలు లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్పీ అనురంజన్ కిస్పొట్టా, ఇతర పోలీసు అధికారులు శనివారం రాత్రి నేరస్థలానికి చేరుకుని స్నిఫర్ డాగ్‌లను కూడా రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతల పరిరక్షణకు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

సాహెబ్‌గంజ్ ఎస్పీ మాట్లాడుతూ.. "సాహిబ్‌గంజ్‌లో ఆదిమ గిరిజన వర్గానికి చెందిన 22 ఏళ్ల మహిళ శరీరం యొక్క 12 భాగాలు కనుగొనబడ్డాయి. శరీరంలోని కొన్ని భాగాలు ఇంకా కనిపించలేదు. వాటి కోసం వెతుకులాట కొనసాగుతోంది. ఆమె భర్త దిల్దార్ అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు అతని రెండవ భార్య. నిందితుడు ఎలక్ట్రిక్ కట్టర్ వంటి పదునైన వస్తువును ఉపయోగించి మహిళ మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో ప్రాథమిక అనుమానితుడు దిల్దార్ అన్సారీ, అయితే ఈ దారుణ హత్యలో ఇతర వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని వారు అనుమానిస్తున్నారు.

Next Story