ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మ‌ర‌ణం

Tragic Road Accident in Balrampur 6 People Killed of the same family. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొట్టడంతో

By M.S.R  Published on  8 April 2023 12:45 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మ‌ర‌ణం

ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంపై మృతుల బంధువులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాకు చెందినది.

మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. శనివారం ఉదయం శ్రీదత్తగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డియోరియా మలుపు గుండా వెళుతున్న కారు ట్రక్కును ఢీకొంది. ఆ సమయంలో కారులో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. ప్రమాదంలో వారంతా కన్నుమూశారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గురువారం బల్‌రామ్‌పూర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో, ప్రయాణికులతో నిండిన బస్సు అదుపు తప్పి కాలువలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. కాన్పూర్‌ నుంచి తులసిపూర్‌కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కువానో వంతెన సమీపంలో అదుపు తప్పి కాలువలో పడిందని పోలీసులు తెలిపారు.


Next Story