ప్రకాశం జిల్లాలో విషాదం.. చేతులు కడుక్కునేందుకు వెళ్లి ముగ్గురు బాలికలు మృతి

Tragic Incident In Prakasam District.గిద్దలూరు మండలం విష్ణు ముసురుపల్లిలో పొలం నుంచి తిరిగి వస్తున్న ముగ్గురు బాలికలు నీటిలో జరిపడి మృతి చెందారు.

By Medi Samrat
Published on : 11 Feb 2021 7:00 PM IST

Tragic Incident In Prakasam District

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గిద్దలూరు మండలం విష్ణు ముసురుపల్లిలో పొలం నుంచి తిరిగి వస్తున్న ముగ్గురు బాలికలు నీటిలో జరిపడి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన బాలికలు వెంకట దీప్తి (14), సుప్రియ (13), సుస్మిత (11)గా గుర్తించారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు. అన్నం తిన్న తర్వాత ముగ్గురు బాలికలు చేతులు కడుక్కునేందుకు వాగులోకి దిగారు. ఒక్కసారిగా నీటిలోకి జారిపడి నీట మునిగిపోవడంతో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు.

అయితే బాలికలు నీట మునుగుతుండగా, దగ్గరలో ఉన్న ఓ బాలుడు బాలికల బంధువులకు సమాచారం అందించాడు. వారి బంధువులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బాలికలను రక్షించే ప్రయత్నం చేశారు. ముగ్గురు బాలికలను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు బాలికలు కూడా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Next Story