విషాదం.. అగ్నిగుండంలో పడి వ్యక్తి మృతి

Tragedy in Sri Satyasai district.. Man dies after falling into fire pit. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మొహరం సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్ని

By అంజి  Published on  16 Aug 2022 3:50 PM IST
విషాదం.. అగ్నిగుండంలో పడి వ్యక్తి మృతి

ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మొహరం సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో పడి వ్యక్తి మృతి చెందాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి.. ప్రమాదవశాత్తు అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడ్డాడు. ఈ విషాదకర ఘటన కొత్తపల్లి మండలం బసంపల్లిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బసంపల్లి గ్రామంలో మొహరం సందర్భంగా అగ్నిగుండం ఏర్పాటు చేశారు. కనుముక్కల గ్రామానికి చెందిన నర్సింహులు బసంపల్లిలో జరుగుతున్న పీర్ల పండుగకు వచ్చాడు.

మద్యం మత్తులో ఉన్న అతడు.. అగ్నిగుండం దగ్గరకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో జారిపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. మంటల్లో కాలిపోతున్న అతడిని బయటకు లాగారు. అప్పటికే నర్సింహులు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మద్యం మత్తులో అగ్నిగుండం దగ్గరకు వెళ్లి కాలుజారి గుండంలో పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story