నెల్లూరులో విషాదం.. ముగ్గురు అనుమానాస్పద మృతి

Tragedy in Nellore district three suspicious deaths of the same family. నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో

By అంజి  Published on  7 Aug 2022 4:01 PM IST
నెల్లూరులో విషాదం.. ముగ్గురు అనుమానాస్పద మృతి

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబంలోని తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. తల్లి, కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇసుకపల్లిపాలెం గ్రామానికి చెందిన మురళి (24), అదే గ్రామానికి చెందిన స్వాతి(19)ని ఏడాదిన్నర కిందట పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐదు నెలల కుమార్తె ఉంది.

ఆదివారం నాడు భార్య, కుమార్తె అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుల శరరీరంపై ఉన్న గాయాలను చూస్తుంటే.. గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగాక ఇంట్లోని మరో రూమ్‌లో మురళి ఉరి వేసుకున్నాడు. ఈ ముగ్గురి మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురి మృతికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు.

Next Story