విషాదం.. కూతురికి ఉరేసి, దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ముషీరాబాద్‌ గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి  Published on  17 Nov 2023 11:39 AM IST
Mushirabad, Crime news, Hyderabad

విషాదం.. కూతురికి ఉరేసి, దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ముషీరాబాద్‌ గంగపుత్ర కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగేళ్ల కూతురు తేజస్వినికి ఉరేసి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దంపతులు సురేశ్‌ బాబు, చిత్రలేఖ, కూతురు తేజస్విని ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. వీరిది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా లక్ష్మీపురం అని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాలుగేళ్ల కూతురికి ఉరేసిన అనంతరం దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. అయితే వీరూ ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఇంట్లో ఉన్న గోడపై సూసైడ్ నోట్ రాశారు. ఇది ఈ సూసైడ్‌ నోట్‌ పలువురి హృదయాలను కదిలించివేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న లక్ష్మీపురంకు చెందిన సురేష్ బాబు, చిత్రలేఖ దంపతులు. వీరికి నాలుగేళ్ల కూతురు తేజస్విని ఉంది. భార్య చిత్రలేఖ బిర్లా సైన్స్ సెంటర్‌లో పనిచేస్తోంది.

అయితే ఈరోజు ఉదయం కూతురికి ఉరివేసి.. అనంతరం దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు గోడపై సూసైడ్ నోట్ రాశారు. తమ చావుకి కారణం బిర్లా సైన్స్ సెంటర్‌లో వర్క్ చేస్తున్న శ్యామ్ కొఠారి , గీత రావులు కారణం అంటూ ఇంట్లో గోడపై మృతురాలు చిత్రలేఖ సూసైడ్ నోట్ రాసింది. ఆమె అక్కడ పని చేస్తున్నప్పుడు ఆమె పై తప్పుడు ఆరోపణలు చేసి జాబ్ నుండి తొలిగించారని సూసైడ్‌ నోట్‌లో ఉంది.

అపాయింట్మెంట్ లెటర్ పే స్లిప్స్ అడిగిన పట్టించుకోలేదని, వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్స్ ను నిలదీసినందుకు తనను ఉద్యోగం నుండి తొలిగించారని సూసైడ్‌లో చిత్రలేఖ పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కు ఎన్నో సార్లు ట్విట్టర్ లో మొర పెట్టుకున్న కూడా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చావుకు వాళ్లే కారణం అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన పలువురిని కంటతడి పట్టించింది. పోలీసులు సూసైడ్ నోట్ ను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story