Hyderabd: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. మూడేళ్ల బాలుడు మృతి

హయత్ నగర్ కుంట్లూర్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు.

By అంజి  Published on  2 Nov 2023 6:30 AM GMT
Hyderabad, School bus, accident

Hyderabd: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. మూడేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌: హయత్ నగర్ కుంట్లూర్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అభం శుభం తెలియని చిన్నారి మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. విగతజీవిగా పడి ఉన్న కొడుకుని చూసి ఆ తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు వెంటనే అప్రమత్తమే కండిషన్స్ లో లేని బస్సులు , నిర్లక్ష్యంగా వాహనాలను నడిపే డ్రైవర్లను పెట్టుకున్న స్కూల్స్ పై అధికారులు దాడులు చేసి కొరడా ఝళిపించారు. అయినా కూడా బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా హయత్ నగర్ కుంట్లూర్ గ్రామంలో మూడు సంవత్సరాల బాలుడు హర్షపవన్ ఆడుకుంటుండగా, స్కూల్‌ బస్సు ఒక్కసారిగా అతడి పైనుండి దూసుకెళ్లింది. కండర్ షైన్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడం వల్ల టైర్ల కింద బాలుడి తల చిదిమి పోయింది. దీంతో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. అది గమనించిన స్థానికులు, తల్లిదండ్రులు ఘటన స్థలానికి వచ్చి చూడగా బాలుడు అప్పటికే మృతి చెందాడు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. బాలుడి మరణం పలువురి హృదయాలను కదిలించి వేసింది.

బాలుడి మరణంతో ఆ గ్రామంలో విషాదం నిండింది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన కూడా స్కూల్ యాజమాన్యం తీరు ఏ మాత్రం మారలేదు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. స్కూల్ బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story