అనకాపల్లిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

By అంజి
Published on : 29 Dec 2023 8:44 AM IST

Anakapalli, suicide, APnews, Crime news

అనకాపల్లిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అప్పుల బాధ తాళలేక వీరంతా బలవన్మరణానికి ఒడిగట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ కుటుంబం కొంతకాలంగా అనకాపల్లిలో నివసిస్తోంది. శివరామకృష్ణ, మాధవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజులుగా ఆర్ధిక ఇబ్బందులతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది.

గురువారం రాత్రి సమయంలో వీరంతా విషం తాగినట్లు తెలుస్తోంది. వీరిలో శివరామకృష్ణ(40), మాధవి (38), కుమార్తెలు వైష్ణవి(16), లక్ష్మి(13) మృతి చెందారు.ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో మరో కుమార్తె కుసుమప్రియ(13) చికిత్స పొందుతోంది. ఘటనా స్థలాన్ని పట్టణ పోలీసులు పరిశీలించారు. ప్రాథమికంగా ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story