శబరిమలలో భక్తులపైకి దూసుకెళ్లిన‌ ట్రాక్టర్

శబరిమలలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో పాటు తొమ్మిది మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

By -  Medi Samrat
Published on : 13 Dec 2025 9:25 PM IST

శబరిమలలో భక్తులపైకి దూసుకెళ్లిన‌ ట్రాక్టర్

శబరిమలలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో పాటు తొమ్మిది మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారందరిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఒక ట్రాక్టర్ కొండ దిగే సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి అత్యంత వేగంగా భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సన్నిధానం ప్రాంతంలో వ్యర్ధాలను తరలిస్తున్న ట్రాక్టర్ భారీ వర్షాల కారణంగా ఏటవాలు రహదారిపై వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి వేగంగా భక్తుల గుంపుపైకి దూసుకెళ్లింది. అది గమనించిన మిగతా భక్తులు, అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

అయితే పారిశుద్ధ కార్మికుల వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌లో సుమారు ఐదుగురు వ్యక్తులు ఉన్నారని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సన్నిధానం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు‌. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ తొలుత పంబాలోని హాస్పిటల్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం సన్నిధానం హాస్పిటల్ నుండి మరో హాస్పిటల్‌కు తరలించినట్లుగా సమాచారం. గాయపడిన వారిలో ప‌లువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై శబరిమలలో భద్రతా చర్యలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కొండ మార్గాల్లో వాహనాల రాకపోకలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు పోలీసులను కోరారు

Next Story