విషాదం.. పెళ్లిబృందంతో వెలుతున్న ట్రాక్ట‌ర్ బోల్తా.. ఆరుగురు మృతి

Tractor overturned in Puthalapattu 6 dead.చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2022 2:24 AM GMT
విషాదం.. పెళ్లిబృందంతో వెలుతున్న ట్రాక్ట‌ర్ బోల్తా.. ఆరుగురు మృతి

చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెలుతున్న ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 24 మంది గాయ‌ప‌డ్డారు.

ఐరాల మండ‌లం జంగాల‌ప‌ల్లి గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ వివాహం జెట్టిప‌ల్లిలో గురువారం జ‌ర‌గాల్సి ఉంది. ఇందుకోసం వ‌రుడి త‌రుపు బంధువులు బుధ‌వారం రాత్రి జెట్టిప‌ల్లికి ట్రాక్ట‌ర్‌లో బ‌య‌లుదేరారు. పూత‌ల‌ప‌ట్టు మండ‌లం ల‌క్ష్మ‌య్య ఊరు స‌మీపంలో వీరు ప్ర‌యాణీస్తున్న ట్రాక్ట‌ర్ అదుపు తప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు, ముగ్గురు మ‌హిళ‌లలు, ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ ఉన్నారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను సురేంద్ర‌రెడ్డి(52), వ‌సంత‌మ్మ‌(50), రెడ్డెమ్మ‌(31), తేజ‌(25), వినీషా(3), దేశిక‌(2)గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story